29-01-2026 12:09:44 AM
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్
కొత్తగూడెం, జనవరి 28, (విజయక్రాంతి): కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం మోడీ దేశంలో కార్మికులు బ్రిటిష్ పాలకులు పై పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తం బడా పారిశ్రామిక వర్గాలు కు లాభం చేకూర్చాలని 50 కోట్ల కార్మికుల హక్కులను మోడీ కాలరాస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్ ఆరోపించారు. బుధవారం కొత్తగూడెం శేషగిరిభవన్ ఏఐటీయూసీ కార్యాలయం లో జరిగిన జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ,ఏఐటియుసి సిఐటియు, ఇఫ్ట్టు, టీయుసిఐ, బిఆర్టీయూ, సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సులో యూసుఫ్ మాట్లాడారూ.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను, అంతర్జాతీయ జాతీయ పెట్టుబడిదారీ వర్గాలకు లేబర్ చట్టాలు అడ్డంగా ఉన్నాయన్నారు. వాటిని మార్చాలని అదాని,అంబానీ లాంటి పెట్టుబడు వర్గాల విజ్ఞప్తికి, అనుకూలంగా దేశంలో 50 కోట్ల మంది కార్మికుల కు ఉపయోగం గా ఉన్న 29 లేబర్ చట్టాలను వీధి పాలు చేస్తున్నారని ధజమెత్తారు. తక్షణమే లేబర్ కోడ్ లను రద్దుచేసి పాత చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సదస్సులోఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటీ ప్రసాద్,ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు జలీల్,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఇఫ్ట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్య, జిల్లా ప్రధాన సురేందర్, బిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో కార్మికుల చట్టాల నిర్మూలన చేసి కార్మికులను నిరాయుధం లని చేసి వాళ్ళ శ్రమను పెట్టుబడి దారులకు దోచి పెట్టేందుకు మోడీ ప్రభుత్వం శాసనం చేస్తుందని ఈ దేశంలో కార్మికులు భారతీయులు కాదా? వాళ్ళకి కుటుంబాలు లేవా?భారతదేశం లో పుట్టి పెరిగినటువంటి కార్మికుల శ్రమను విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడం అంటే మరోసారి బ్రిటిష్ పరిపాలకులను ఆహ్వానించడం కాదా అని అన్నారు.
రాజ్యాంగం ను రద్దు చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది అని ఇప్పటికి మోడీ ప్రభుత్వం ఒకవైపు కార్మి చట్టాల మార్పు,ఉపాధి హామీ చట్టం మార్పు చేస్తూ రద్దు చేస్తూ, విద్యుత్ సవరణ బిల్లు,విత్తనసవరణ చట్టం,ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడి ఆహ్వానం, స్వదేశీ బ్యాంకులపై విదేశీ బ్యాంకులతో పెట్టుబడు లకు ఆహ్వానం, రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, ఇలా చెప్పుకుంటూ పోతే భారత దేశంలో ప్రకృతి వనరులు మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం దారులు తెరుస్తూ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని వారు ఆరోపించారు.
కార్మిక సోదరీ సోదరులారా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు బందు పెన్షన్ బందు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బందు సంక్షేమ పథకాలు బందు విద్యా వైద్యం బందు చేస్తూ ప్రజలని నడిరోడ్డుపై నిలబెట్టేందుకు బిచ్చగాళ్లగా బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ దశలో కార్మికులందరూ దేశ సమగ్రతను సంక్షేమ చట్టాలను కాపాడుకునేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి 12 సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు నాగభూషణం,జి నగేష్ గోనె మని,వంగ వెంకట్, భాస్కర్, ఎండూరి ప్రభావతి, కే బ్రహ్మచారి, భూక్యా రమేష్,జి పద్మ, నూపా భాస్కర్, సంజీవ్, డీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.