03-02-2026 02:16:48 AM
ఎస్టీయూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల వీరభద్రం
ఏటూరునాగారం,ఫిబ్రవరి2(విజయక్రాంతి):ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏఐఎస్టీఎఫ్/ఎస్టీయూటీఎస్ స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 5న నిర్వహించే మహ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవివీరభద్రం పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న సిపిఎస్ పెన్షన్ నష్టదాయకమైనది అనీ,ఉపాధ్యాయులు సర్వీస్ అంతా దాచుకున్న కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో,లాభనష్టాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసానిచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పోటీ పరీక్షలు నెగ్గి ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు సవర్ధవంతులు,ఉన్నత విద్యావంతులు అని,అలాంటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఓటు హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని, సీపీఎస్ పెన్షన్ రద్దు,ఎస్గీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని ఫిబ్రవరి 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవివీరభద్రం పిలుపునిచ్చారు.