calender_icon.png 26 July, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణంల తనిఖీ

25-07-2025 10:54:35 PM

భీమారం,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎరువుల గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి కొరత లేకుండా చూడడమే ఈ టాస్క్ ఫోర్స్ టీం ఉద్దేశమని మండల వ్యవసాయ అధికారి అత్య సుధాకర్ అన్నారు. ఎరువుల కృత్రిమ కొరత లేకుండా చూడడం, ఎరువుల దుకాణాల ముందు స్టాక్ బోర్డు, ధరల పట్టిక తప్పకుండా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ అవసరాలకు తప్ప ఏ ఇతర అవసరాలకు యూరియా అమ్మ వద్దని, వాడవద్దన్నారు.