09-08-2025 10:55:40 PM
భూత్పూర్: హైదరాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Alla Venkateshwar Reddy) నివాసంలో రాఖీ(Raksha Bandhan) పండుగ సందర్భంగా తన సోదరి గీత ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అక్క తమ్ముడు బంధానికి రాఖి గుర్తు అని మాజీ ఎమ్మెల్యే ఆల తెలిపారు. నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష అంటూ అన్యోన్యంగా సంస్కృతి సాంప్రదాయాల నేలవేంపుగా జరుపుకునే పండుగ రాఖీ అన్నారు. రాఖీ పండుగలో అన్నాచెల్లెల బంధం మరింత బలపడుతుందని చెప్పారు. ఒకరికొకరు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.