calender_icon.png 17 August, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుదాం

17-08-2025 12:28:10 AM

ఖైరతాబాద్;ఆగస్టు 16 (విజయ క్రాంతి) : మట్టి వినాయకులను ప్రతిష్టించి, పర్యావరణాన్ని కాపాడాలని జై గణేశ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎంఎల్‌సి బొగ్గారపు దయానంద్ గుప్తా, చైర్మన్ కె.ఎస్. ఆనంద్ రావులు పిలుపునిచ్చారు. శనివారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి ప్రతినిధులతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం, తమ సంస్థ తరఫున మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ను నిషేధించి మట్టి వినాయకులను  పూజించాలని ప్రజలను కోరారు. మట్టి వి నాయకుల తయారీ కళాకారులను, పూజించిన భక్తులను అవార్డు ప్రదానంతోపాటు శాలువాతో సత్కరించి మెమోంటో అందజేస్తామని తెలిపారు. సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో  ఆన్నదానం, పండ్లు, స్వీట్స్, వాటర్ ప్యాకెట్లు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సమితి నేతలు రాములు మహేశ్ శ్రీకాంత్ రవిబాబు, మహిళా విభాగం కన్వీనర్ శ్రీడేవిగౌడ్, సునీత తదితరులు పాల్గొన్నారు.