17-08-2025 12:29:55 AM
- ఉమెన్స్ హాస్టల్ యజమానిపై దాడి
- చితకబాదిన విద్యార్థిని తల్లిదండ్రులు
- మాదాపూర్‌లో ఘటన
శేరిలింగంపల్లి, ఆగస్టు 16: మాదాపూర్‌లోని ఓ మహిళా హాస్టల్లో ఆదివారం రాత్రి ఘర్షణ చెలరేగింది. 16ఏళ్ల బాలికపై హాస్టల్ యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినీ వారి తల్లిదండ్రులకు తెలపడంతో హాస్టల్ యజమాని సత్యప్రక్పా దాడి చేశారు. ఈ క్రమంలో హాస్టల్లోని అద్దా లు, ఫర్నీచర్, కుండీలు ధ్వంసమయ్యాయి. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని అర్ణ వ్ ప్లాజాలో ఉన్న ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వ ర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో బోరబండకు చెం దిన మైనర్ విద్యార్థిని నీట్ కోచింగ్ కోసం ఉంటోంది.
నెలరోజులుగా బాలికను యజమాని సత్య ప్రకాష్ వేధిస్తున్నాడని తోటి అమ్మాయిలు ఆరోపించడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, లైంగిక దాడి ఆరోపణలను సత్యప్రకాశ్ ఖండించాడు. భవనం సంబంధిత వివాదంలో భాగంగానే తనపై దాడి జరిపినట్లు పేర్కొన్నాడు. గత మూడు నెల ల్లో ఇది రెండోసారి దాడి జరిగిందని తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని యజమానిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి లైంగిక దాడి జరిగిందా లేదా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.