17-08-2025 12:27:59 AM
కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి)/నిజాంసాగర్/ఎల్లారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిం డుకుండలా మారాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వ ర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు పొంగిపొర్లుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియో జకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మం డలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకుంది.
జలాశయంలోకి ప్రస్తుతం 3వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి 21 అడుగులకు నీటిమట్టం చేరుకుని అలు గు దూకుతోంది. పోచారం నుంచి అలుగు పారుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్నది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతున్నది. అలాగే సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఐదు గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నిజాంసాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది.
ప్రాజెక్టులో ప్రస్తుతం 19,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మొత్తం 1,045 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 1396.25 అడుగులకు నీరు చేరింది. కామా రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కళ్యాణి ప్రాజెక్టులో 600 క్యూసెక్కుల వరద నీరు వ చ్చి చేరింది. కళ్యాణి ప్రాజెక్ట్ 409.50 అడుగుల నీటిమట్టం కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉన్నది.
ప్రాజెక్ట్ దాదాపు గా నిండటంతో రెండు గేట్లు ఎత్తి 300 క్యూ సెక్కుల నీటిని దిగువ ఉన్న మంజీరాలోకి అధికారులు వదులుతున్నారు. 250 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువ లోకి విడుదల చేస్తున్నారు. అలాగే జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారు తున్నది. ఈ నీరు కామారెడ్డి వాగు నుంచి పల్వాంచవాగు గుండా మిడ్ మానేరు డ్యామ్ లోకి వెళ్తుంది. లింగంపేట్, గాంధారి, భీమేశ్వర వాగులు పొంగిపొర్లుతున్నాయి.