calender_icon.png 25 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సమస్యను కలిసి మెలిసి పరిష్కరించుకుందాం

25-09-2025 12:22:06 AM

వనపర్తి టౌన్ : ఆదివాసీలు, లంబాడీల సమస్యను పరిష్కరం కోసం అన్నదమ్ముల్లాగా కలిసి గిరిజన సంఘం ఉపాధ్యాయ సంఘం విద్యార్థి సంఘం అందరం కలిసి జేఎసీ ఏర్పాటు చేసుకొని మన సమస్యను పరిష్కరించుకుందామని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ కోరారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న అన్ని తండాల నుంచి గత వారం గిరిజన సోదరులు వచ్చి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి మా బాధలు చెప్పుకోవడం జరిగిందన్నారు.

అనంతరం గిరిజన సోదరులు అందరూ కలిసి రాజకీయాలకతీతంగా అందరం ఒక తాటి పైన ఉండి జేఏసి ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు  కొంతమంది బి ఆర్ ఎస్ నాయకులు గిరిజనుల అన్యాయం జరుగుతుందని ఏనాడూ ఒక మాట మాట్లాడని వారు నేడు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని వారు మాట్లాడటం వారికి సిగ్గుచేటు ఉండాలన్నారు. ఈ సమస్య ఆదివాసీలు లంబాడీల అన్నదమ్ముల సమస్య అని దీనిని బిఆర్ఎస్ పార్టీ రాజకీయ కోసం సభ నిర్వహిస్తున్నారని దీనివలన రాబోవు తరం మన గిరిజన లంబాడి సోదరులకు గొడ్డలి పెట్టు లాంటిదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.