25-09-2025 12:22:05 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల, ప్రత్యేక అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ నుండి డా. లలిత పాల్గొన్నారు. ఆర్కే డిగ్రీ , పీజీ కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే ఈ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ యొక్క విశిష్టతను పూల యొక్క గొప్పతనాన్ని తెలుపుతాయని, ప్రకృతి ని ఆరాధించు గొప్ప పండుగ ఈ బతుకమ్మ అనీ పేర్కొన్నారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని ప్రతి ఆడపడుచు ఈ పండుగను భక్తి భావాలతో శ్రద్దాసక్తులతో జరుపుతారని తెలిపారు. ఈ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. అతిథులు, కళాశాల బతుకమ్మ సంబరాలకు వారిని ఆహ్వానించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అతిథులు కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి , డీన్ నవీన్ కుమార్, ప్రిన్సిపల్స్ గోవర్ధన్ రెడ్డి, గంగాధర్, శంకర్, వైస్ ప్రిన్సిపల్స్ ప్రభాకర్, బాలు మహేంద్ర, రవి, శ్రీధర్, శ్రీవాణి, మీనాబాయి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.