13-04-2025 12:00:00 AM
ప్రపంచ వ్యాప్తంగా ఆహార వృథా ఒక తీవ్రమైన సమస్యగా మారింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌ఈపీ) విడుదల చేసిన తాజా ‘ఫుడ్ వెస్టేజ్ ఇండెక్స్’ ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.05 బిలియన్ టన్నుల ఆహారం వ్యర్థమైంది. ఈ మొత్తం వృథాలో ప్రధాన భాగం ఇళ్లనుంచి వస్తోంది. గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి వ్యక్తి సగ టున సంవత్సరానికి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తుంటాడు. ఇదే సమయంలో లక్షలాది మంది పిల్లలు, పెద్దలు సరైన పోషకా హారానికి నోచుకోక ఆకలితో బాధపడుతున్నారు. ఒకవైపు కోట్లాదిమంది ఆకలితో ఇ బ్బందులు పడుతుంటే, మరోవైపు వందల టన్నుల ఆహారం ఇలా వృథా అవడం విచారకరం.
ఈ సమస్యను సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు భారత ప్రభుత్వం ‘సేవ్ ఫుడ్, షేర్ ఫుడ్’ వంటి కార్యక్రమాలను ప్రారంభించిం ది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని అవసరమైన వారికి పంచే అవకాశాలు పెరిగా యి. పాఠశాలల పాఠ్యాంశాల్లో చిన్నప్పటి నుంచే ఆహార విలువను బోధించాలి. దీనిద్వారా బాధ్యతాయుతమైన అలవాట్లు వారి కి అలవడుతాయి. విద్యాసంస్థలలో ఫుడ్ ట్రాకింగ్ యాప్స్, డిజిటల్ కంట్రోల్ కెఫెటీరియాలు వంటివి ప్రవేశపెట్టాలి. వ్యక్తిగతం గా గాక సామాజికంగా అనుసరించాల్సిన ధర్మం కూడా. ఈ చిన్న మార్పు ఆకలితో ఉ న్న జీవితాలకు పరోక్షంగా దోహద పడుతుంనడంలో సందేహం లేదు.
డా. వేపకొమ్మ కృష్ణకుమార్