1 May, 2026 | 1:55 PM

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం

29-06-2025 05:30 PM

యుటిఎఫ్ రాష్ట్ర  కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపితం చేయాలని  యుటిఎఫ్ రాష్ట్ర  కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి అధ్యక్షతన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ  ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని కోరారు. 

విద్య సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు సకాలంలో అందించి నందుకు, ఈసారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించినందుకు  ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేశారు. మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు అవసరమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అలా కాకుండా  జిల్లా కేంద్రానికి, హైవే లకు దగ్గర్లో గల ప్రాంతాలకు ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం డిప్యుటేషన్లు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీరు మారకపోతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు. పిఆర్సి గడువు తీరినందున పిఆర్సి రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.