09-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి టౌన్, జూలై ౮ : మాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖ ర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో రాజశేఖర్ రెడ్డి నిరుపేదలకు ఉపయోగపరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మ న్ కౌన్సిలర్లు, ఆయా మండలాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.