09-07-2025 12:00:00 AM
ఈ నెల 13 వరకు సత్యసాయి నిగమాగమంలో..
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): ఆషాఢం, బోనాల మహోత్స వాలను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ ఈ నెల 13 వరకు శ్రీనగర్ కాలనీ సత్య సాయి నిగమాగమంలో నిర్వహించబడుతోంది. ఇక్కడ అన్ని రకాల బెనారస్, చందేరీ, పోచంపల్లి, పటాల, గద్వా ల్, బెంగళూరు క్రాష్, కంచిపట్టు, కలకత్తా, జ్యువలరీతో పాటుగా అనేక ఇతర వస్తువులు కూడా అనేక కొత్త మోడల్స్ అందుబాటులో ఉంటాయి.
సంస్థ నిర్వాహకులు శ్రీనివాస రావు, వినయ్ మాట్లాడు తూ.. దేశం నలుమూలల నుంచి అనేక వయ్య ప్రయాసలతో, అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ దగ్గరకు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి వస్తూ ఉంటారని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తాము వారికి ఈ నెల 10వ తేదీన ఇక్కడే వారందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య బీమా, ఏదైనా సమస్య ఉంటే వాటికి పరికరాలు, ఉచితంగా మందులకు కూడా మేము అందజేస్తామని తెలిపారు.