calender_icon.png 23 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామగ్రామాన బీఆర్‌ఎస్ జెండా ఎగరేయాలి

23-07-2025 12:27:20 AM

బీఆర్‌ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి

హుజూర్ నగర్, జూలై 22: హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు.మంగళవారం పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశంలో మాట్లాడారు... స్థానిక సర్పంచ్, జడ్పిటిసి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించటం ఖాయమన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ల్యాండు, ఇసుక మాఫియా, ప్రస్తుతం కల్తీ మద్యం యదేచ్చగా కొనసాగుతున్నాయని అన్నారు.

మేళ్లచెరువు మండలం రామాపురంలో దొరికిన కల్తీ మధ్యలో అధికార పార్టీ నాయకుల హస్తాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.మంత్రి ఉత్తమ్  మౌనం వహించడం పట్ల పలు అనుమానాలకు తావు ఇస్తుందన్నారు. అధికారులు కూడా అధికారంలో ఉన్న నాయకుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.అధికారం ఎవరికి శాశ్వతం కాదని, రానున్న రోజుల్లో మళ్ళీ బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అప్పుడు అంతా కూడా మిత్తితో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి,కెయల్ యన్ రెడ్డి,జక్కుల నాగేశ్వరావు,పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్,భాస్కర్ రెడ్డి, అలీ,నబి, పరుశురాం,రమేష్, తదితరులు,పాల్గొన్నారు.