calender_icon.png 4 November, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీనేజీ వయసులో వ్యసనాలకు లోను కావద్దు

04-11-2025 07:36:19 PM

వ్యసనాలకు పాల్పడితే జీవితం అగమ్య గోచరమవుతుంది..

కామారెడ్డి మాజీ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమణ..

కామారెడ్డి (విజయక్రాంతి): యుక్త వయసు ఉన్నవారు వ్యసనాలకు బానిసలు కావద్దని కామారెడ్డి ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రమణ అన్నారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. టీనేజీ వయసులో విద్యార్థులు అవరోధాలను జయిస్తేనే విజయం లభిస్తుందని అన్నారు. లేకుంటే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు జోలికి వెళ్ళవద్దన్నారు. జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎంతో ఆశలు పెట్టుకుంటారని అన్నారు. ఆరోగ్యశాఖ, ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.

విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని అందుకు అనుగుణంగా చదువుకోవాలన్నారు. పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం సాధిస్తారన్నారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల మానసిక రోగాలు వస్తాయని అన్నారు. సమాజంలో మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు తమను సంప్రదిస్తే పలు సలహాలు సూచనలు ఇస్తామన్నారు. మత్తు పదార్థాలు వినియోగించే విద్యార్థులు, యువకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. దీంతో జీవితం నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసిడబ్ల్యూ సభ్యురాలు స్వర్ణలత, సోషల్ వర్కర్ రాహుల్, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఇర్ఫాన, అధ్యాపకులు, విద్యార్థులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.