04-11-2025 10:04:28 PM
సెక్టోరియల్ అధికారి భరత్ కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): విద్యాశాఖ ఏకీకృత సమాచార వ్యవస్థ(యుడైస్) లో సరైన, ఖచ్చితమైన సమాచారం, వంటి పూర్తి వివరాలను అన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని సెక్టోరియల్ అధికారి భరత్ కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ(మోడల్) పాఠశాలలో మంగళవారం మండలం, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
యుడైస్ అన్ లైన్ లో నమోదు చేసిన వివరాల ప్రకారమే వచ్చే విద్యా సం..లో అవసరమైన నిధులు, అదనపు తరగతి గదులు, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్త కాలు మొదలగు కనీస అవసరాలు మంజూరు అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రాజ్ కుమార్, మండల విద్యాధికారి దత్తు మూర్తి, ప్రధానోపాధ్యాయులు పద్మావతి, అనురాధ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు పాల్గొన్నారు.