calender_icon.png 5 November, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా అమ్ముతున్న వారిపై మెరుపు పోలీసుల దాడి

04-11-2025 10:21:33 PM

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో గుడుంబా అమ్మేవారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఏటూరు, ముప్పనపల్లి గ్రామ పరిధిలో ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో గుడుంబా అమ్మేవారిపై మెరుపు దాడి నిర్వహించగా ఇందులో ఏటూరు గ్రామ నివాసి చిట్టె బత్తుల గట్టమ్మ, ముప్పనపల్లి గ్రామంలో తొంగరి సావిత్రి బత్తిని వెంకటలక్ష్మి బుద్దె ఇందిరా వీరి వద్ద దాదాపుగా 40 లీటర్ల గుడుంబా పట్టుకోని కేసు నమోదు చేయడం జరిగింది. కల్తీ సారా తాగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గుడుంబాని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరు అమ్మిన సమాచారం ఇవ్వాలంటూ ఎస్సై వెంకటేష్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ కానిస్టేబుల్ ప్రవీణ్ లాల్ మహమ్మద్ పాల్గొనడం జరిగింది.