11-01-2026 01:28:10 AM
పసుపు బండారి తల్లులకు మొక్కులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు తల్లులకు ప్రధానంగా ఎత్తు బంగా రం, వడిబియ్యం, పసుపు బండారి, ఎదుర్కొల్లు ప్రధానంగా మొక్కులుగా సమర్పిస్తా రు. కోరిన కోరికలు తీరితే ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సంతానం కలిగితే వెండి తొట్టెలు సమర్పించడం, వివాహం జరిగితే నూతన వధూవరులు జంటగా వచ్చి అమ్మల ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. అలాగే వనదేవతలకు వడి బియ్యం, పసుపు బండారి, చీరే, పూలు గద్దె పైన సమర్పించి కొబ్బరికాయలు కొట్టి, ఎదుర్కొల్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మరికొందరు కోడెదూడను సమర్పించడం, తలనీలాలను సమర్పించడం కూడా జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరిన రోజు లక్షల మంది భక్తులు తమ మొక్కులను సమర్పించడం జరుగుతుంది.
వడిబియ్యం సమర్పించడానికి ప్రత్యేకంగా క్లాత్ హుండీలను ఏర్పాటు చేయడం విశేషం. నగదు, బంగారు వెండి ఆభరణాలను సమర్పించడానికి హుండీలను ఏర్పాటు చేస్తారు. హుం డీల్లో విదేశీ కరెన్సీ కూడా భక్తులు వేయడం ప్రత్యేకత. రెండు ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర సందర్భంగా ఆదాయం కోట్ల రూపాయల్లో లభించడం ఇంకో విశేషం. ముఖ్యంగా తల్లులకు ప్రీతికరమైన మొక్కు (బెల్లం) ఎత్తు బంగారంగా భావిస్తారు.
బండి సంపత్ కుమార్
మహబూబాబాద్, విజయక్రాంతి