03-11-2025 01:23:55 AM
							హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాగల రెండు, మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. సోమవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం నిజామాబాద్ మంచిప్పలో 54.8 మి.మీ., కామారెడ్డి జిల్లా గాంధారిలో 50.8 మి.మీ, నిర్మల్ ముజిగిలో 41.8 మి.మీ, కామారెడ్డి బోమన్‌దేవిపల్లిలో 33.0 మి.మీ, ఆదిలాబాద్ గుడిహత్నూర్‌లో 32.3 మి.మీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారంలో 23.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.