03-11-2025 01:25:17 AM
మృతుడి కుటుంబానికి పెద్దకర్మ నిమిత్తం 50కేజీల బియ్యం ఆర్థిక సహాయం
ఏటూరునాగారం, నవంబర్2 (విజయక్రాంతి): ములుగు ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెసు మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు అనంతరం మానవతా విలువలను ప్రతిబింబిస్తూ మరణించిన జగజెంపుల భూమయ్య కుటుంబానికి ఆదివారం పెద్ద కర్మ కార్యక్రమం కావడంతో 50 కేజిల బియ్యం అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది అన్నారు.
సహాయం ద్వారా ఎవరికి ఏ ఆపద ఉన్నా మీము ఉన్నాము అనే కాంగ్రెస్ పార్టీ సేవా తపన చూసి గ్రామస్తులు ప్రజలు అభినందిస్తునారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, జిల్లా నాయకులు ఎండి ఖలీల్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, మండల నాయకులు గంపల శివకుమార్, మాజీ వార్డు సభ్యులు పడిదల హనుమంత్ మల్లయ్య, రాములు, రాజు ఎర్రయ్య, సాంబయ్య కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.