03-11-2025 01:23:41 AM
							హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, నవంబర్ 2 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు,
నష్ట ప్రభావం పై ప్రాథమిక అంచనా కోసం సర్వే చేస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నాటి ప్రజావాణి రద్దు కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రకటనలో వెల్లడించారు.