calender_icon.png 14 September, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహిత కాలనీలో పిడుగుపాటు

14-09-2025 06:51:17 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో గత రెండు రోజులుగా  రాత్రి వేళలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం మూలంగా పిడుగుపాటుకు గురై విలువైన విద్యుత్ పరికరాలు కాలి పోయిన ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి పట్టణం లోని ప్రాణహిత కాలనీలో భారీ శబ్దంతో పిడుగు పడింది. కాలనీ లోని 3, 4, నెంబర్ల బ్లాక్ ల మధ్యలో నున్న చెట్టుకు పిడుగు పడటం తో రెండు బ్లాక్ ల పరిధిలోని 16 మంది సింగరేణి కార్మికుల ఇండ్ల లోని విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

రాత్రి భారీ వర్షం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా, ఒక్క సారిగా పిడుగు పడటం  తో ఏం జరిగిందోనని కాలని వాసులు తీవ్ర  భయాందోళనల కు గురయ్యారు. ఒకవైపు బారి వర్షం, దీనికి తోడు పిడుగు పడటం తో ఒక్క సారిగా రెండు  బ్లాక్ ల ఇండ్ల నుండి మంటలు చెలరేగి పొగలు రావడం, విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కార్మిక కుటుంబాల సభ్యులు బిక్కుబిక్కు మంటు చిమ్మ చీకట్లో మగ్గాల్సి వచ్చిందని పలువురు వాపోయారు. పిడుగుపాటుతో కార్మిక నివాసాల్లోని టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, సెటప్ బాక్స్ లు, ఏసీలు వంటి విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు కాలిపోయాయని దీంతో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చెట్లను తొలగించాలి...

కార్మిక కాలనీలో ఏపుగా పెరి గిన చెట్లను తొలగించాలని  కాలనీవాసులు కోరుతున్నారు. చెట్లు పెరగడంతో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతున్నాయని తద్వారా తరచూ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల మూలంగా చెట్లపై పిడుగులు పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కార్మిక కుటుంబాల సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు .కార్మికుల వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ తీగలు, పరికరాలు ఉన్న సమీపం లోని చెట్ల కొమ్మలను తొలగించాలని పలువురు కాలనీ వాసులు కోరుతున్నారు.