calender_icon.png 14 September, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు

14-09-2025 08:37:00 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని బొమ్మక్ బాలయ్య గార్డెన్స్ లో విక్టరీ షాటకన్ కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహెష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరాటే క్రీడల్లో ఒక భాగం అని,  శరీర ఎదుగుదలకు, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తే సహకరిస్తామని అన్నారు. 29 సంవత్సరాలుగా జాతీయ  కరాటే పోటీలను నిర్వహిస్తున్న అసోసియేషన్ ను అభినందించారు.