calender_icon.png 14 September, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవోపా జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి రమేష్

14-09-2025 07:42:48 PM

కోదాడ: ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ఇమ్మడి రమేష్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక గుడిగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన అవోపా కోదాడ 21వ వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ రమేష్ ను జిల్లా అధ్యక్షునిగా ప్రకటించారు. గత సంవత్సరాలుగా కోదాడ అవోపాను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రమేష్ను అధ్యక్షునిగా నియమించినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, వృద్ధ వైశ్యులకు పెన్షన్లు తోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్ జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా కోదాడ పట్టణ అవోపా అధ్యక్షునిగా కందిబండ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షులు ఇరువురిని పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, మిత్రమండలి అభినందించారు.