14-09-2025 07:55:38 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో హనుమకొండ పట్టణ పరిధిలోని వివిధ అపార్ట్ మెంట ప్రతినిధులు సమావేశం అయ్యారు. ప్రస్తుత కమిటీ పనితీరును ఎండగట్టారు. అపార్ట్మెంట్ వాసులు గత మూడున్నర సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నోచుకోక ఇబ్బందిలకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుత జిల్లా కమిటీ కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని, సమస్యల పరిష్కారానికి అవగాహనా అంకిత భావం కలిగిన నాయకత్వం అవసరమని, కావున తక్షణమే నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం అర్జుల కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత కమిటీలలో పని చేసిన అనుభవజ్ఞులు రఘుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ల సూచనల మేరకు నూతన కార్యవర్గాన్ని నెలరోజుల వ్యవధిలో ఎన్నుకునేలా చర్యలు చేపట్టాలని, లేనిచో తామే నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుంటామని పలువురు సభ్యులు అన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పద్ధతి ప్రకారం నియమానుసారంగా క్రమ పద్దతిలో నిర్వహించాలని అన్నారు.