14-09-2025 08:01:45 PM
దళితరత్న కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్
మందమర్రి,(విజయక్రాంతి): జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విశేష కృషి చేస్తున్నారని ఆయన కృషి తోనే మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కలిగిందని దళిత రత్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే శాఖ నుండి అనేక రైళ్ల నిలుపుదలకు పార్లమెంట్లో, పార్లమెంటు బయట తన గళం వినిపిస్తున్నారన్నారు. వందే భారత్ రైలు నిలుపుదలతో ఈ ప్రాంతంలో వ్యాపారం, రవాణ సౌకర్యం మరింత మెరుగు పడుతుందని జిల్లా ప్రజలు రైల్వే రవాణాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.