విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి
14-06-2025 11:06 PM
ఏఎల్ఎంకు తీవ్ర గాయాలు...
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శనివారం జరిగిన వేరువేరు ప్రమాదాల్లో విద్యుత్తు లైన్మెన్ మరణించగా, అసిస్టెంట్ లైన్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన క్రాంతి కుమార్ డోర్నకల్ లో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విద్యుత్ లైన్ కు మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఇదే జిల్లా ఇనుగుర్తి మండలంలో అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.






