03-01-2026 06:06:08 PM
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని శిల్పకుంట్ల గ్రామ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు శనివారం ఆ గ్రామ సర్పంచ్ అంజ పల్లి నరసమ్మ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ... మూడు సంవత్సరాలు పైబడిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు .అంగన్వాడి కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలను గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు అందించాలన్నారు. మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ,ఆయాలు ,చిన్నారులు తదితరులున్నారు.