03-01-2026 06:09:00 PM
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్ కుమార్, ఎన్ పీ వెంకటేష్, ఎం.సురేందర్ రెడ్డి లు అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పలువురు మాట్లాడుతూ మహబూబ్నగర్లో ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధితోపాటు ఇతర రంగాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటుచేసి నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీజె బెనహర్, సిరాజ్ ఖాద్రీ, షబ్బీర్, అజ్మత్ అలీ, రాములు యాదవ్, నవనీత, ఫయాజ్ , అవేజ్, పీర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.