calender_icon.png 25 October, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తుతో జీవితాలు చిత్తు

25-10-2025 12:42:08 AM

ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రబాను

ఇల్లెందు, అక్టోబర్ 24, (విజయక్రాంతి): ఇల్లందులో పాత బస్టాండ్ లోని అయిత ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్లకు, హమాలీలకు శుక్రవారం పోలీసులు చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు డిఎస్పి చంద్రబాను పాల్గొని మా ట్లాడుతూ.. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రతిరోజు చేపట్టే చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా జనాలకు డ్రగ్స్ గురిం చి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డిఎ స్పీ తెలిపారు.

డ్రగ్స్ అమ్మకం, రవాణా, కలి గి ఉండడం, సేవించడం, కొనడం చట్టరీత్యా నేరమని, ఆ విధంగా ఎవరైనా పట్టుబడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎస్ హెచ్ ఓ తాటిపాముల సురేష్, ఎస్త్స్ర సూర్యతో పాటు పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు హమాలీలు పాల్గొన్నారు.