calender_icon.png 25 October, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి అక్రమ రవాణా చేస్తున్న వాహనాల సీజ్

25-10-2025 12:43:14 AM

ములకలపల్లి, అక్టోబర్ 24,(విజయక్రాంతి):మట్టిని అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను, మట్టిని త్రవ్వి ట్రాక్టర్లలో నింపుతున్న జెసిబిని శుక్రవారం ములకలపల్లి తాసిల్దార్ బి.గనియా నాయక్ స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని పాములేరు వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి అక్రమ డంపు నుంచి వాహనాల ద్వా రా రవాణా చేస్తున్నారు.

అందిన సమాచా రం మేరకు తాసిల్దార్ ములకలపల్లి ప్రధాన రహదారిలో వీటిని నిలుపుదల చేసి పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుం డా మట్టి అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను, మట్టిని డంపు చేసిన ప్రాంతం దగ్గర నుంచి జెసిబి ని స్వాధీనం చేసుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. చ ట్టంలోని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ తెలిపారు.