16-10-2025 02:32:43 AM
చేవెళ్ల , అక్టోబర్ 15 : పాడి రైతులు పశువులకు గాలిగుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆలూర్, పల్గుట్ట పశువైద్యాధికారులు దేవేందర్‌రెడ్డి, శిరీష అన్నారు. పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆలూర్, పల్గుట్ట, దామరగిద్ద గ్రామాల్లో పశువుకలు టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు మాట్లాడుతూ..
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పాడిరైతులు 6 నెలలకు ఒక సారి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని సూచించారు. ఈవ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా వ్యాధి సోకిన పశువులకు దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయన్నారు. రైతులు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో ఆలూర్, పల్గుట్ట పశువైద్యాధికారులు దేవేందర్‌రెడ్డి, శిరీష, పశువైద్య సిబ్బంది శ్రీధర్‌రెడ్డి, దేవేందర్, ఎల్‌ఎస్‌ఏలు శ్రీకాంత్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.