calender_icon.png 16 October, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధాపూర్‌లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

16-10-2025 02:31:26 AM

శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థు లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రీన్‌ఫీల్డ్ స్కూల్లో చదువుతున్న మెడిశెట్టి శ్యామ్ సూర్య వెంకటేష్ (14), రామేశ్వరం సాయి స్వదీప్ (14) అనే బాలురు ఇద్దరూ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందో ళన చెందుతున్న ఘటన మధాపూర్ ప్రాం తంలో చోటుచేసుకుంది.

వెంకటేష్ అక్టోబర్ 14న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, ట్యూషన్‌కు వెళ్తానని చెప్పి స్కూల్ బ్యాగ్‌తో పాటు కొన్ని దుస్తులు తీసుకొని 5 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయాడు. అయితే అదే ట్యూషన్ వెళ్లే అతని సోదరి వెంకటేష్ అక్కడికి రాలేదని, అదే తరగతిలో చదువుతున్న అతని స్నేహితుడు రామేశ్వరం సాయి స్వదీప్ కూడా ట్యూషన్‌కు వెళ్తా అంటూ ఇంటి నుంచి బయలు దేరి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది.

ఇద్ద రూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమోనని కుటుం బ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రారంభం చుట్టుపక్కల గాలించినా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మధాపూర్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు బాలురు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. వారిద్దరి ఆచూకీ తెలిసిన వారు మధాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు, కుటుంబ సభ్యులు కోరారు.