calender_icon.png 18 December, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

16-12-2025 06:22:02 PM

అర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 28వ వార్డు సంబంధించిన అబ్దుల్ సోఫియాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి చికిత్స నిమిత్తం ఆయనకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఐదు లక్షల ఎల్ఓసి కాపీని మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తేవాలన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని అన్నాడు. 

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని అన్నాడు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా మాకు తెలియజేస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శీను, జాగీర్ధార్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిరుపతి నాయక్, ఖాందేష్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, చిన్న రెడ్డి, కార్యదర్శులు కుమార్, ప్రసన్న గౌడ్, గోపికృష్ణ, మని తదితరులు పాల్గొన్నారు.