06-09-2025 10:43:52 PM
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండల పరిధిలోని ఉండాల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో శనివారం మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలఫై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై కురుమూర్తి మాట్లాడుతూ... యువత దురలవాట్లకు, బెట్టింగులకు, ప్రాణాంతకమైన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే క్రమంలో వ్యక్తిగత సమాచారాలు ఇవ్వరాదని తెలిపారు. విద్యార్థులు గ్రామాలకు వెళ్ళినప్పుడు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలన్నారు.