06-10-2025 12:50:33 AM
సర్కార్ తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి హరీశ్‌రావు లేఖ
తెలంగాణకు కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : పీజీ వైద్య విద్యలో స్థానిక రిజర్వే షన్ అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. యాజమాన్య కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడంతో వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ర్టంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉండగా, వాటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద, మిగిలిన 50 శాతం రాష్ర్ట కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) యాజమాన్య కోటాగా ఉంటాయని తెలిపారు. అయితే, ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు.
పక్క రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్ కల్పిస్తూ, కేవలం 15శాతం సీట్లు మాత్రమే నాన్- లోకల్ విద్యార్థులకు కేటాయిస్తూ నిర్ణ యం తీసుకుందని, ఆ విధానంతో ఆ రాష్ర్ట విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్దఎత్తున లాభం జరుగుతోందని వెల్లడించారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, రాష్ర్ట విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యా ర్థులు కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, స్థాని క విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు చేసి, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశారని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌కు ఇచ్చిన ప్రాధాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విద్యార్థులకు జరుగుతున్న నష్టం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర విడాలని, వెంటనే ఈ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌ది మోస చరిత్ర, బీజేపీది ద్రోహ చరిత్ర
తెలంగాణ ప్రజలను మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూ దొందే అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు., ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వ ర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జెడ్పీ స్థానం బీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతుందని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురు తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులేనని, తెలంగాణ పాలిట శకునిలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరు అని విమర్శించారు.
తెలంగాణకు కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని భరోసా ఇచ్చారు. కేసీఆర్.. తెలంగాణే తన ప్రాణంగా భావించారని, కాని ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.