calender_icon.png 6 October, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ కస్టడీకి అంబేద్కర్

06-10-2025 01:10:54 AM

నాలుగు రోజుల పాటు విచారణకు అనుమతించిన ఏసీబీ కోర్టు 

విద్యుత్‌శాఖ మాజీ ఏడీఈని 200 కోట్ల ఆస్తులపై ప్రశ్నించనున్న అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆదాయానికి మిం చిన ఆస్తుల కేసులో అరెస్టయి, చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న విద్యుత్ శాఖ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) అంబేద్కర్‌ను ఏసీబీ కస్టడీకి తీసుకుంది. అక్రమాస్తుల మూలాలను లోతుగా శోధించేం దుకు కస్టడీకి అనుమతించాలని ఏసీ బీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు, 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ శనివా రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఏసీబీ అధికారులు అంబేద్కర్‌ను తమదైన శైలిలో విచారించనున్నారు.

200 కోట్ల అవినీతి సామ్రాజ్యం

గత నెల 16న అంబేద్కర్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇబ్రహీంబాగ్, నార్సింగి, మణికొండ వంటి ఖరీదైన ప్రాం తాల్లో ఏఈ, ఏడీఈగా పనిచేసిన అం బేద్కర్, తన అధికారాన్ని దుర్వినియో గం చేసి పెద్ద ఎత్తున భూములు, భవనాలు, ప్లాట్లు కూడబెట్టినట్లు గుర్తించా రు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అం చనా వేశారు. అంతేకాకుండా, అంబేద్కర్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ఇంట్లో రూ.2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదా యానికి మించిన ఆస్తులున్నట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు అంబేద్కర్‌ను అరెస్టు చే యగా, విద్యుత్ శాఖ అతడిని విధుల నుంచి తొలగించింది.

విచారణలో కీలక అంశాలు

ఈ నాలుగు రోజుల కస్టడీలో భారీ గా కూడబెట్టిన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు, నగదు లావాదేవీలు, బినామీల వివరాలు, ఈ అక్రమాలకు సహకరించిన ఇతర అధికారుల పా త్రపై ఏసీబీ అధికారులు అంబేద్కర్‌ను లోతుగా ప్రశ్నించనున్నారు. అతని బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులపై కూ డా ఆరా తీయనున్నారు. విచారణలో కీలక విషయాలు తేలనున్నాయి.