25-10-2025 11:32:04 PM
ఇబ్రహీంపట్నం: మండల పరిధి శేరిగూడ గ్రామ సమీపంలోని శ్రీ ఇందు కాలేజ్ ఎదురుగా ఆర్ అండ్ బీ అధికారులు శనివారం సాయంత్రం స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి, సూచిక బోర్డులను మరిచారు. కాగా శ్రీ ఇందు కాలేజ్ ముందు, సాగర్ రహదారి ప్రధాన దారి కావడంతో రోజువారిలా వేగంగా వచ్చే పలు వాహనాలు ప్రమాదాల గురయ్యాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను మరచి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.