26-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): బ్రెయిన్ ఓ విజన్ ఆధ్వర్యంలో ఆది వారం మాదాపూర్‌లోని టీ హబ్‌లో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవా ర్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్, జేఎన్‌టీయూ కాకి నాడ వైస్ ఛాన్స్‌లర్ శివరామకృష్ణ ప్రసాద్, బ్రెయిన్ ఓ విజన్ సీఈఓ గణేష్ నాగ్ దొడ్డి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్రెయిన్ ఓ విజన్ సీఈఓ గణేష్ నాగ్ దొడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి భార త్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపం చంలోని ఎంతో మందిని చదువులో గొప్ప గా తీర్చదిద్దిన గురువులను సత్కరించడం అనేది తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ అవార్డ్స్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 300 మంది నామి నేషన్స్ రాగా అందులో నుంచి 250మందిని ఎంపిక చేసి అవార్డ్స్ అందజేశామ న్నారు.
దేశంలోని 20 రాష్టాల నుంచి 12 కేటగిరీల్లో ఎంపికైన ప్రొఫెసర్లకు అవార్డ్స్ ఇచ్చి ఘనంగా సత్కరించామని తెలిపారు. వివిధ రంగాల్లో నిపుణులైన 14మంది ద్వారా ఈ అవార్డ్స్ అందచేసినట్లు తెలిపారు. అవార్డ్స్‌లో భాగంగా 2లక్షల90వేల ఓట్లు రాగ అందులో అత్యధిక ఓట్లు సాధించిన వారికీ అవార్డ్స్ ఇచ్చినట్లు తెలిపారు.