తహ‘సీల్’ కార్యాలయం!
హాజీపూర్ ఎమ్మార్వో ఆఫీసుకు తాళం!
ప్రజలు, స్టూడెంట్స్‌కి తిప్పలు
ఎలక్షన్ డ్యూటీతోనే: సిబ్బంది
మంచిర్యాల, మే 9 (విజయక్రాంతి) : జిల్లాలోని హాజీపూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి అధికారులు వెళుతుండటంతో సేవలు అందక అటు రైతులు, ఇటు విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల డ్యూటీ పేరు చెప్పి కార్యాలయాలకు తాళాలు వేసి వెళుతున్నారు. ఉన్నతాధికారులకు ఎలక్షన్ డ్యూటీ వేసి నా కార్యాలయ సిబ్బంది మాత్రం ఆఫీసులో ఉండి డ్యూటీ చేయాల్సి ఉండగా ఏ ఒక్కరు లేకుండా ఏకంగా కార్యాలయానికే తాళం వేసి ఉండటం, ఫోన్‌లో సంప్రదించినా మేము ఎన్నికల విధుల్లో ఉన్నాం, ఎలక్షన్ల తర్వాత రావాలని ఉచిత సలహాలు ఇస్తుండటంతో చేసేదేమి లేక తిరిగి వెలుతున్నారు.
ప్రజలకు తప్పని ఇబ్బందులు...
ఎలక్షన్ బ్యూటీల పేరిట అధికారులు వెలుతుంటే కార్యాలయంలో ఉండే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇదే అదనుగా కార్యాలయానికి తాళం వేసి ఇంటిబాట పడుతున్నారు. దీని తో కులం, నివాస, ఆదాయం, ఇతరత్రా సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం వారం రోజుల పాటు కార్యాలయం చుట్టు తిరుగాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయంలో ఎలక్షన్ డ్యూటీ లేని వారంతా ఉం డేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






