calender_icon.png 6 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు

06-09-2025 01:33:10 AM

-ముంబై పోలీస్ శాఖ జారీ

-‘బెస్ట్ డీల్ టీవీ’ విస్తరణ కోసం ఓ వ్యాపారవేత్త నుంచి రూ. 60 కోట్ల అప్పు

-అప్పు చెల్లించని దంపతులు 

-ఆగస్టులో పోలీసులను ఆశ్రయించిన రుణదాత దీపక్ కొఠారి 

ముంబై, సెప్టెంబర్ 5: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్‌కుం ద్రా దంపతులపై ముంబై పోలీసులు శుక్రవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రూ.60 కోట్ల మేర ఓ వ్యాపారవేత్తను మో సం చేసిన కేసులో శిల్పాశెట్టి దంపతులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులోనే ముంబై పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీప క్ కొఠారి ఫిర్యాదుతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఈ వివాదంపై ఆగ స్టు 14నే జుహూ పోలీస్ స్టేషన్‌లో కేసు న మోదైందని పోలీసులు పేర్కొన్నారు. ఏవై నా కేసులు నమోదయినపుడు దేశం విడిచి వెళ్లకుండా నిఘా ఉంచడం కోసం లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ దంపతుల ట్రావెల్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు. శిల్పాశెట్టి కంపెనీ ఆడిటర్‌ను కూడా విచారించారు. 

హామీ ఇచ్చి.. మోసం చేశారు

శిల్పా శెట్టి దంపతులు ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు. 2015 నుంచి 2023 మధ్య ఈ దంపతులు రూ. 60 కోట్లు తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపించారు. ‘రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా శిల్పాశెట్టి దంపతులతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారి వద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం బెస్ట్ డీల్ టీవీ షేర్లు 87.6 శాతం మేర ఉండేవి. 2015 ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ. 31.95 కోట్లు, 2015 జూలై, 2016 మార్చి మధ్య రూ. 28.54 కోట్లు బదిలీ చేశా.

సకాలంలో డబ్బులు తిరిగిస్తామని శిల్పాశెట్టి దంపతులు తెలిపారు. 2016లో ఆ కంపెనీ నుంచి శిల్పా శెట్టి వైదొలిగింది. చాలా సార్లు ప్రయత్నించిన ఆర్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు’ అని లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఉన్న కొఠారి తెలిపారు. అడల్ట్ కంటెంట్ కేసులో ముంబై పోలీసులు 2021లో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బిట్ కాయిన్ మోసం కేసులో రాజ్‌కుంద్రా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.