22-10-2025 04:16:45 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పుబజార్ గల స్వయంభూ మహాదేవ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని బుధవారం శివ స్వాములు మాలధారణ ధరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, శివుని పాటలు స్మరిస్తూ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గురుస్వామి ఎర్ర హరికిషన్ కర్ధమ స్వాములకు మాల ధారణ చేశారు. దీంతో శివాలయం భక్తులతో కిటకిటలాడింది.