15-07-2025 11:15:23 PM
ఊపిరి పీల్చుకున్న ఉమ్మడి జిల్లా వాసులు, అటవీశాఖ అధికారులు
డిఎఫ్ఓ బోగా నిఖిత
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరించడం ఉమ్మడి జిల్లా అటవీశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రెస్యూటీ ఆపరేషన్ చేపట్టారు. గత మూడు రోజులుగా అడవి బాట పట్టిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సేఫ్ గా వెళ్లిపోయిందని ఆధారాలను ఆటవిశాఖ అధికారులు సేకరించారు. పులి పై విష ప్రయోగానికి పాల్పడిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట తండా చెందిన భూక్యమైపాల్, సలావత్ భూపాల్, గంగావతి కన్నీరు, దీపావత్ సంజీవ్ లపై అటవీ శాఖ సెక్షన్ల ప్రకారం అదుపులోకి తీసుకొని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జాతీయ వన్యమృగ చట్టం కింద పెద్దపులిని చంపేందుకు ఆవు దూడ కు విషం పెట్టి పెద్దపులిని చంపేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భోగానికిత తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గత మూడు రోజులుగా అడవులను జల్లడ పట్టిన అటవీ శాఖ రెస్క్ టీం పెద్దపులి సేఫ్ గా వెళ్లిందని ఫ్లాష్ కెమెరాల్లో రికార్డయినట్లు, అడవిలో ఆనవాళ్లు లభించినట్లు తెలిపారు. రోజుకు 70 కిలోమీటర్లు నడిచే పెద్దపులి కామారెడ్డి, నిజామాబాద్ సరిహద్దుల నుంచి ఎటువైపు వెళ్లిందో కానీ సేపు గానే వెళ్ళిందని ఆనవాళ్లు కనిపించినట్లు డిఎఫ్ ఓ తెలిపారు. వన్య మృగాన్ని చంపేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు సిబ్బంది రెస్క్యూ టీం అధికారులను సిబ్బందిని అభినందించినట్లు తెలిపారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.