15-07-2025 11:43:50 PM
చండూరు,(విజయక్రాంతి): దేవునిదయ, దేవుని ఆశీస్సులతో మాత్రమే మనం చేసే పనికి ఫలితం వస్తుందని, పోటీ చేసి విజయం సాధించాలన్న దైవ సహాయం చాలా ముఖ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరటుపల్లి మార్కండేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం జరిగిన రఘునందన స్వాముల వారి 40వ ఆరాధన ఉత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో జన్మలకు ఒకసారి మానవ జన్మ వస్తుంది మానవ జన్మకు స్వార్ధకం కావాలంటే సమాజంలో మంచి పనులు చేసి, సేవా భావంతో ముందుకు వెళుతూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలవాలని తెలిపారు.
చావు పుట్టుకలు మనిషికి సహజం చనిపోయిన తర్వాత అయిన ఆ వ్యక్తిని గుండెల్లో పెట్టుకునేలా ... డబ్బుల సంపాదన కన్నా ఆప్తులను సంపాదించుకోవడం ముఖ్యమన్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చిన రఘునందన స్వామి భక్తి భావాలతో సేవాభావాన్ని అలవర్చుకొని, శిష్య బృందం తో పాటు ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్నారని వారి సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు. శ్రీ మలయాళ స్వామి ఆశ్రమ పీఠాధిపతులు దయానందగిరి స్వామివారి మంత్రోచ్ఛారణతో విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞం, గీతా పారాయణం తోపాటు ఆధ్యాత్మిక సభలో సనాతన ధర్మం గురించి మహాత్ములు చేసిన ప్రవచనాలు ఎంతగానోఎంతగానో అలరించాయి. అనంతరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు నోట్ బుక్స్ ను,మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారం అందజేశారు. విచ్చేసిన పెద్దలకు శాలువాలతో సన్మానించారు.అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.