calender_icon.png 16 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యూష మృతి కేసులో నలుగురు అరెస్ట్

15-07-2025 11:32:44 PM

కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మహత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చ అంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లిదండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతి తో పాటు బానోతు శృతి కారులో హనుమకొండ- కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళుతుండగా కాకతీయ వింటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష మరణానికి కారకులైన ఈ నలుగురిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సిఐ చేరాలు, ఎస్ఐలు దేవేందర్, రవి, క్రైమ్ కానిస్టేబుల్స్ క్రాంతి, వివేక్  పాల్గొన్నారు. అయితే అల్లాడి ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని విలేకరుల ముందు హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది.