15-07-2025 11:48:07 PM
పెన్ పహాడ్: తుంగతుర్తి (తిరుమలగిరి)లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఏ మేరకు తమ నేతపై విమర్శలు గుప్పిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు బగ్గున మండిపడ్డారు. ఈసందర్బంగా మండలంలోని అనాజీపురంలో బీఆర్ఎస్ యువ నాయకులు, మాజీ సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తనదైన శైలీ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘాటు జవాబు ఇచ్చారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వరుసగా 8 పంటలకు సాగునీరు ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డి దే అని గుర్తు చేశారు. బిఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములలో కూడా వద్దన్నా దాకా నీళ్ళు ఇవ్వడంతో భూములు జాలుగా పొంగిపొర్లిందన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఎటువంటి ప్రకటన చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై జవాబు ఇవ్వకుండా సీఎం స్థాయిని మరిచి పనికట్టుకొని జగదీశ్ రెడ్డి పై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని ఇది ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.