15-07-2025 11:39:45 PM
బెజ్జెంకి: అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సరైన ఆహారం అందించడం పై సిబ్బందికి అవగాహన లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ , భారతి అన్నారు. మండలంలోని బేజ్జంకి వీరాపూర్ అంగన్వాడి కేంద్రాలను , బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనాన్ని, కస్తూర్బా పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర హార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతిలు కలిసి మంగళవారం ఆకస్మిక తనకి నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సరైన ఆహారం అందించడంపై సిబ్బందికి అవగాహన లేదని, కాంట్రాక్టర్ నాణ్యమైన గుడ్లు అందించకపోవడంతో కాంట్రాక్టర్ తో ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగింది. దీనిపై చర్యలు తీసుకొని కమిషన్ కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రి తనకిచ్చేసి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు వైద్య సేవలపై వైద్యాధికారితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ మండల విద్యాధికారి మహతి లక్ష్మి, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.