calender_icon.png 13 September, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువును సన్మానించిన లారీ మెకానిక్ లు

13-09-2025 08:18:37 PM

చిట్యాల (విజయక్రాంతి): తమకు విద్య నేర్పిన గురువు పరిస్థితి తెలుసుకొని శిష్యులు అంతా కలిసి శనివారం ఆయనను సన్మానించి 22,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన లారీ మెకానిక్ లు. చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన లారీ మెకానిక్ మేస్త్రి గుమ్మ ప్రసాద్ గతంలో చాలామందికి మెకానిక్ పని నేర్పించి వారికి ఉపాధి కల్పించేలా కృషి చేశారు. మంచి స్థితిలో ఉన్న శిష్యులు తన పరిస్థితిని తెలుసుకొని సన్మానించినందుకు ఆయన ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా గుమ్మి ప్రసాద్ మాట్లాడుతూ తన వద్ద పని  నేర్చుకున్న శిష్యులు తనను  గుర్తుపెట్టుకుని వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన శిష్యులు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని వారిని ఆశీర్వదించారు. తను నేర్పిన విద్యను శిష్యులు మరికొంతమందికి నేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బషీర్, బెల్లంకొండ రామకృష్ణ,  ఆరుద్ర శ్రీనివాస్, ఆలయ బ్రహ్మయ్య ,  మహేందర్రెడ్డి,  ఎస్ కే ఇబ్రహీం, ఎండి మన్సూర్, ఎస్కే నాగూర్, ఎస్కే కరిముల్లా,  ఊట్కూరి బాలకృష్ణ,  దర్శనపు సోమయ్య , డివి రావు తదితరులు పాల్గొన్నారు.