13-09-2025 08:10:21 PM
ట్రస్మా జిల్లా మాజీఅధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు
కరీంనగర్: బాస్ స్కీం విద్యార్థుల స్కాలర్షిప్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని జమ్మికుంట పట్టణంలో న్యూ మిలీనియం పాఠశాలలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గడిచిన కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయలేదని, పాఠశాలు నడిపించే పరిస్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులు అధికారుల, సంబంధిత మంత్రుల వద్దకు వెళ్లి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దసరా సెలవు తర్వాత పాఠశాల పునః ప్రారంభించే పరిస్థితి లేదన్నారు. ఈనెల 18 లోపు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే రెండు రోజులలో తదుపరి కార్యచరణ విడుదల చేస్తామని తెలిపారు. వృత్తి విద్య కళాశాలలు, ఇతర డిగ్రీ కళాశాల వారు ఈ కార్యచరణకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు పుల్లూరి సంపత్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాలో స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు.