calender_icon.png 3 November, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత

03-11-2025 01:26:21 AM

వాజేడు నవంబర్ 2(విజయ క్రాంతి): అధునాతన టెక్నాలజీని ఉపయోగించి రహదారిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను కనుగొని ఆదివారం బాధితునికి వాజేడు మండలం స్థానిక ఎస్త్స్ర జక్కుల సతీష్ అందించారు. వివరాలలోకి వెళితే.. వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మొడేమ్ శ్రీకాంత్ అను వ్యక్తి 25 రోజుల కిందట నాగారం నుండి ఇప్పగూడెం గ్రామానికి వెళుతున్న తరుణంలో మార్గమధ్యంలో తన ఫోన్ పడిపోయింది. శ్రీకాంత్ వాజేడు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన స్థానిక ఎస్త్స్ర సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ కానిస్టేబుల్ రమణతో వివరాలు సేకరించి సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో వివరాలను పొందుపరిచారు. ఆ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కనిపెట్టి బాధితునికి అందించారు. ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను కనిపెట్టవచ్చని తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే కారణమని తెలియజేశారు.